News November 7, 2025

పిల్లల విక్రయం? పెళ్లి కాకుండానే మహిళ ప్రసవాలు!

image

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన ఓ అవివాహిత గురువారం ఇంట్లో బిడ్డకు జన్మనిచ్చారు. శిశువుకు హెల్త్ బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతంలోనూ ఆమెకు రెండు ప్రసవాలు జరిగినట్లు గుర్తించిన సిబ్బంది కంగుతిన్నారు. బిడ్డలను కని, విక్రయించడమే వారి వ్యాపారమని స్థానికులు చెబుతున్నారు. వైద్య సిబ్బంది శిశువును నంద్యాలలోని కేర్‌ సెంటర్‌కు తరలించారు.

Similar News

News March 15, 2026

భువనగిరి: కూతురిని చంపి తల్లి సూసైడ్ అటెంప్ట్

image

భువనగిరి మండలం తుక్కపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నీలిమ తన కుమార్తె క్రితి రెడ్డి, కుమారుడు అంశాత్ రెడ్డిపై కత్తితో దాడి చేసింది. గొంతు కోయడంతో క్రితి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు తప్పించుకుని కేకలు వేయడంతో స్థానికులు చేరుకున్నారు. అనంతరం నీలిమ ఆత్మహత్యాయత్నం చేసింది. గాయపడిన బాలుడు, నీలిమను ఆసుపత్రికి తరలించారు.

News March 15, 2026

సన్‌రైజర్స్‌కు పాక్ ప్లేయర్ దూరం?

image

The Hundred టోర్నీ కోసం అబ్రార్(పాక్)ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ లీగ్ జులై 21-AUG 16 వరకు కొనసాగనుండగా అదే సమయంలో పాక్ టీమ్ 2 టెస్టుల సిరీస్ కోసం విండీస్‌లో పర్యటించనుంది. అందువల్ల అబ్రార్‌కు పాక్ NOC ఇవ్వకపోవచ్చని, టోర్నీలో ఆడటం అనుమానమేనని సమాచారం. కాగా అతను టోర్నీకి అందుబాటులో ఉంటాడనే కొనుగోలు చేశామని SRH హెడ్ కోచ్ వెటోరీ చెప్పిన విషయం <<19370720>>తెలిసిందే.<<>>

News March 15, 2026

జగిత్యాల: సైబర్ మోసగాళ్ల వలలో పోలీసు అధికారి.!

image

సైబర్ మోసగాళ్లు పోలీసు అధికారినే లక్ష్యంగా చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ASIకి గుర్తుతెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసి అతని వీడియోను రికార్డు చేశారు. అనంతరం దానిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో భయపడిన ASI మూడు విడతల్లో రూ.95,500 వారి ఖాతాకు పంపించాడు.