News November 7, 2025

గద్వాల: విషాదం.. హాస్టల్‌లో విద్యార్థి SUICIDE

image

HYD తెలుగు విశ్వవిద్యాలయం వసతిగృహంలో విషాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన పద్మ కుమారుడు పరశురాం(20) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం హాస్టల్‌ గది తలుపు తెరవకపోవడంతో సిబ్బంది బద్దలుకొట్టి చూడగా, పరశురాం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 22, 2026

భద్రాద్రి ట్రస్టు బోర్డుపై వీడని సందిగ్ధత!

image

భద్రాద్రి రామాలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు దశాబ్ద కాలంగా వాయిదా పడుతూనే ఉంది. ఏటా రూ. 50కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఈ ఆలయానికి బోర్డు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చినా, ఆశావహులు భారీగా ఉండటంతో ప్రక్రియ నిలిచిపోయింది. 27న శ్రీరామనవమికి CM రేవంత్ రానున్న నేపథ్యంలో, ఈసారైనా ట్రస్టు బోర్డుపై స్పష్టత వస్తుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

News March 22, 2026

జనగామ: ఎంపిక చేసిన అంగన్వాడీలకు నిధుల కేటాయింపు!

image

అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. గతేడాది పోషణ వాటిక కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన అంగన్వాడీలకు అందులో కనీస సౌకర్యాలు, కల్పించాల్సిన సౌకర్యాల కోసం ఒక్కో కేంద్రానికి రూ.25 వేల మంజూరు చేసింది. జిల్లాలో ఎంపికైన 227 అంగన్వాడీ కేంద్రాలకు రూ.56 లక్షలు మంజూరయ్యాయి. వీటితో చిన్నారులకు మ్యాట్లు, క్రీడా సామగ్రి, ఇతర పరికరాల కొనుగోలుకు వినియోగించనున్నారు.

News March 22, 2026

కొండచిలువల రక్తంలో బరువును తగ్గించే మాలిక్యూల్

image

బర్మీస్ కొండచిలువలు తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలవు. ఆ తర్వాత నెలలపాటు తిండి లేకుండా ఉండగలవు. ఇలాంటి అసాధారణ జీవక్రియకు వాటి రక్తంలోని pTOS మాలిక్యూల్ కారణమని స్టాన్‌ఫోర్డ్(US) సైంటిస్టులు గుర్తించారు. దీన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లలో వాడొచ్చని, ఊబకాయంపై పోరాటంలో ఇదొక కీలక మలుపు అని పేర్కొన్నారు. pTOSను ఎలుకలకు ఇవ్వగా అవి తక్కువ ఆహారం తిని 28 రోజుల్లోనే 9% బరువు తగ్గాయన్నారు.