News November 7, 2025
MBNR: నేడు మోస్తరు నుంచి భారీ వర్షాల అవకాశం

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం(నేడు) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీమ్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సహా మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
Similar News
News March 13, 2026
ఎల్లుండి దానధర్మాలు చేస్తే?

MAR 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే మీన సంక్రాంతి అంటారు. ఈ పవిత్రమైన రోజున జపాలు, పుణ్యస్నానాలు ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. ‘గత జన్మ పాపాల నుంచి విముక్తికై ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. లక్ష్మీనృసింహస్వామికి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున చేసే దానధర్మాలకు విశేష పుణ్యఫలం ఉంటుంది. ఇతరుల శ్రేయస్సు కోరి చేసే ఈ పనులతో కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి’ అంటున్నారు.
News March 13, 2026
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై వీడని ఉత్కంఠ

ADB విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. బ్లూప్రింట్ సిద్ధమైందని నేతలు చెబుతుండగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. రన్‌వే విస్తరణకు 249.81 ఎకరాలు అవసరం కానుంది. దీంతో భూములు ఎటువైపు పోతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో బాధితుల్లో భయం పెరిగింది. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
News March 13, 2026
HYD: ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేడు సా.4 గంటలకు సమ్మె నోటీస్ ఇవ్వనుంది. ఉద్యోగుల డిమాండ్లు- ఆర్టీసీ ప్రభుత్వ విలీనం, 2021 పీఆర్సీ, ఉద్యోగ భద్రత, బస్సుల సంఖ్య పెంపు, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు వంటి 11 అంశాలు- పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు విమర్శించారు.


