News November 7, 2025
లెస్బియన్ అఫైర్.. 6 నెలల బిడ్డను చంపిన తల్లి?

తన భార్య మరో మహిళతో అఫైర్ పెట్టుకుని 6 నెలల బిడ్డను చంపి ఉండొచ్చని తండ్రి ఆరోపించారు. తమిళనాడు కృష్ణగిరి(D)లో ఈ ఘటన జరిగింది. కొన్ని రోజుల కిందట బేబీ మరణించగా, అనారోగ్యమే కారణమనుకుని పోస్టుమార్టం చేయకుండానే పూడ్చిపెట్టారు. తాజాగా భార్య ఫోన్‌లో లెస్బియన్ చాటింగ్‌ను గుర్తించిన భర్త.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇవాళ బేబీ బాడీకి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 16, 2026
సల్మాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ ఛేంజ్

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా పేరు మారింది. దీనికి ‘మాతృభూమి- may war rest in peace’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సల్మాన్ Xలో పోస్టర్ షేర్ చేశారు. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల కాగా చైనా నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే టైటిల్ మార్చినట్లు సమాచారం.

WOW.. 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క

అరుణాచల్ ప్రదేశ్‌లో 189 ఏళ్ల క్రితం కనుమరుగైన ‘హెన్కెలియా మోనోఫిల్లా’ అనే అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించారు. లోహిత్ జిల్లాలో బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని కనుగొంది. రాష్ట్రంలోని అద్భుతమైన జీవవైవిధ్యానికి ఇది నిదర్శనమని సీఎం పెమా ఖండూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆవిష్కరణ రాష్ట్రంలోని అసాధారణ జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సంపదను ప్రపంచానికి చాటిచెబుతుందని కొనియాడారు.