News April 11, 2024

కృష్ణా: ఫార్మసీ రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలో అక్టోబర్ 2023లో నిర్వహించిన ఎం-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1100 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు. 

Similar News

News April 1, 2026

కృష్ణా జిల్లాలో మద్యం అమ్మకాల సేల్ వాల్యు విలువ ఎంతంటే..!

image

కృష్ణా జిల్లాలో ఏప్రిల్ 2025 – మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యు విలువలో(-2%) తిరోగమనం కనిపించింది. గత 12 నెలల్లో రూ.1,064.95 కోట్ల విలువైన 14.84 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 6.75 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా, ఏప్రిల్ 2024 – మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 13.89 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 3.99 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,083.23 కోట్లుగా నమోదైంది.

News April 1, 2026

మచిలీపట్నంలో పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ

image

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని 7, 9 డివిజన్‌లలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పెన్షన్లు పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన కలెక్టర్ పెన్షన్ దారులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ సొమ్ము సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇప్పించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు తదితరులు ఉన్నారు.

News April 1, 2026

కృష్ణా: జీఎస్టీ వసూళ్లు సక్రమంగా జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో వస్తు సేవల పన్నులు(జీఎస్టీ) సక్రమంగా వసూలు అయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ మంగళవారం నిర్వహించారు. జిల్లాలో వసూలవుతున్న జీఎస్టీ పన్నుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.