News April 11, 2024
ఆ విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ తరగతులు

TG: ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం మార్చి 30 నుంచి మే 31 వరకు హాలిడేస్ ప్రకటించింది. గురుకులాలు మాత్రం మే 16 నుంచి 31 వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించాయి. ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు, ప్రస్తుతం మెయిన్స్, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న సెకండియర్ విద్యార్థులతో సమానంగా మే 15వరకు వేసవి తరగతులు నిర్వహించనున్నాయి. హాలిడేస్‌లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయనున్నారు.
Similar News
News March 22, 2026
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో పాక్ టాప్

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో ఈసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఉగ్రదాడులతో నమోదైన మరణాలు 6% పెరిగి 1,139కు చేరాయి. 2013 తర్వాత ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పొరుగుదేశాలు.. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెన్షన్స్.. TTP, BLA సంస్థల దాడులు ఇందుకు కారణాలని రిపోర్ట్ తెలిపింది. కాగా గత ఏడాది ఈ ఇండెక్స్‌లో బుర్కినో ఫాసో, పాక్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.
News March 22, 2026
ఉస్తాద్ భగత్‌సింగ్ టికెట్ రేట్స్ తగ్గింపు

AP: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరలు రాష్ట్రంలో రేపటి నుంచి తగ్గనున్నాయి. ఉగాదికి రిలీజైన ఈ మూవీకి 10రోజుల పాటు హైక్‌కు ప్రభుత్వం అనుమతించింది. అయితే TGతో సమానంగా ధరలను ఉంచేందుకు మేకర్స్ రేపటి నుంచే తగ్గించాలని డిసైడ్ అయ్యారు. టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో ₹100, మల్టీప్లెక్స్‌లలో ₹125 తగ్గనున్నాయి. దీంతో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
News March 22, 2026
ఇదేందయ్యా ఇది.. మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు..

AP: అనంతపురం పోలీసులకు వింత ఫిర్యాదు అందింది. తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి ఉగాది సందర్భంగా మటన్, తలకాయ కొనుగోలు చేశాడు. కుక్కర్‌లో సుమారు 20 సార్లు ఉడికించినా ఆ మాంసం ఉడకలేదని విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వండిన పాత్రతో సహా వెళ్లడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతనికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు.


