News November 7, 2025
విడుదలకు సిద్ధమవుతున్న వరి రకాలు

☛ M.T.U.1282: దీని పంటకాలం 120-125 రోజులు. మధ్యస్త సన్నగింజ రకం. చేనుపై పడిపోదు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. గింజ రాలిక తక్కువ. దిగుబడి ఎకరాకు 2.8-3టన్నులు.
☛ M.T.U.1290: పంటకాలం 117-120 రోజులు. సన్నగింజ రకం. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. చౌడునేలలకు అత్యంత అనుకూలం. సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు నేలల్లో ఎకరాకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎగుమతులకు అనుకూలం.
Similar News
News March 12, 2026
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక వార్నింగ్

గత 8 ఏళ్లుగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ వేధిస్తున్నారని రష్మిక వాపోయారు. 24గంటల్లో వేధింపులు మితిమీరిపోయాయని పేర్కొన్నారు. తన ఫ్యామిలీని కూడా లాగారని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. 24గంటల్లో ఆ కంటెంట్‌ను తొలగించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ X వేదికగా వార్నింగ్ ఇచ్చారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ రద్దు వార్తలపైనే ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.
News March 12, 2026
చామంతి మొక్కల తలల కత్తిరింపుతో కలిగే లాభం

చామంతి సాగులో అధిక దిగుబడి రావాలంటే మొక్కల తలల కత్తిరింపు తప్పక చేపట్టాలి. పొలంలో మొక్కలన్నీ 30 సెంటీమీటర్లు దాకా పెరిగిన తర్వాత వాటి తలలను తుంచేయాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా పూల దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్కల తలలను తుంచాక నిపుణుల సూచనలతో నత్రజని, పొటాష్ ఎరువులను తగిన మోతాదులో అందిస్తే నాణ్యమైన పువ్వులను పొందవచ్చు.
News March 12, 2026
ప్రతీకార సెగలు.. US వ్యూహం వికటించిందా?

వెస్ట్ ఏషియాలో యుద్ధం కొత్త మలుపు తిరిగింది. యుద్ధాన్ని ముగించేందుకు ఇప్పుడు ఇరాన్ షరతులు విధిస్తోంది. మరోవైపు దాడులతో ఆశించిన ఫలితం దక్కకపోవడం, చమురు ధరలు ఎగబాకడంతో యుద్ధాన్ని కొనసాగించాలా లేదా విరమించాలా అన్న సందిగ్ధంలో అమెరికా పడింది. యుద్ధాన్ని కొనసాగించాలా లేక శాంతి చర్చలకు మొగ్గు చూపాలా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.


