News November 7, 2025
వైబోపేతంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణ వేడుక శుక్రవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవగా చిత్రకూట మండపంలో కొలువు తీర్చి విష్వక్సేన, పూజ పుణ్యవచనం చేశారు. స్వామివారికి కంకణ ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Similar News
News March 4, 2026
ప్రజాపాలన ప్రగతిని పకడ్బందీగా నిర్వహించాలి: SRPT కలెక్టర్

మార్చి 6 నుంచి చేపట్టనున్న ‘ప్రజాపాలన ప్రగతి’ 99 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామసభల్లో తెలపాలన్నారు. పారిశుధ్యం, డ్రగ్స్ నివారణ, మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని తెలిపారు.
News March 4, 2026
మహబూబ్‌నగర్: రేపు ఈ కాలనీల్లో నీటి సరఫరా బంద్!

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర కాలనీ, మర్లు, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో గురువారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా సరఫరా నిలిపివేస్తున్నట్లు లైన్మెన్ మాధవరెడ్డి తెలిపారు. కాలనీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
News March 4, 2026
చిత్తూరులో మళ్లీ నాటుతుపాకుల వినియోగం.!

జిల్లాలో నాటుతుపాకి కలకలం రేపింది. అడవి పందులు, కుందేళ్లు, జింకలు, దుప్పివంటి వన్యప్రాణులను వేటాడి, మాంసాన్ని బెంగళూరు, చెన్నై నగరాలకు స్మగ్లింగ్ చేయడానికి నాటు తుపాకులు వినియోగించేవారు. 2020లో SP జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 500లకు పైగా నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతానికి అనుకొని ఉన్న కొన్ని గ్రామాల్లోని కంసాలీలు రహస్యంగా నాటు తుపాకులను తయారు చేసేవారు.


