News November 7, 2025
HNK: ఈనెల 10న టాస్క్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(TASK) ఆధ్వర్యంలో హనుమకొండ చైతన్య యూనివర్సిటీలోని రీజినల్ ఆఫీసులో నవంబర్ 10న కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్, కంటెంట్ మాడరేటర్, అనాలసిస్ట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. 2024, 25 సంవత్సరాల్లో B.TECH, BE/B.Sc/B.Com/BCA, BA పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్వ్యూకి హాజరుకావాలని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ ప్రతినిధులు సూచించారు.
Similar News
News April 6, 2026
హుజురాబాద్, జమ్మికుంటలో పేలుడు పదార్థాల అక్రమ దందా!

హుజురాబాద్, జమ్మికుంట కేంద్రంగా అత్యంత ప్రమాదకర స్థాయిలో ఎక్స్ ప్లోజివ్స్ దందా కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌ప్లోజివ్స్, డిటోనేటర్లను ఒకే వాహనంలో తరలిస్తూ వ్యాపారులు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు. స్వల్ప ఉష్ణోగ్రతలకే భారీ పేలుడు సంభవించే అవకాశం ఉన్నా, రద్దీప్రాంతాల గుండా ఈ అక్రమ దందా సాగుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే కిలోమీటర్ల మేర విధ్వంసం తప్పదని తెలిసినా.. అధికారులు పట్టించుకోవట్లేదు.
News April 6, 2026
ఖమ్మం: గాలివాన వచ్చినా విద్యుత్ ఆగదు!

ఖమ్మం జిల్లాలో వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు 5 ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. ఐటీఐ నిపుణులతో కూడిన ఈ బృందాలు ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో అందుబాటులో ఉంటాయి. వీరికి ప్రత్యేక వాహనాలు, పనిముట్లు అందించారు. సమస్య తలెత్తితే వెంటనే 1912 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.
News April 6, 2026
మెదక్ జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షునిగా మోహన్ రాజు

మెదక్ జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షునిగా మోహన్ రాజు ఎన్నికయ్యారు. మెదక్‌లో జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఎన్నికలు జరిగాయి. గౌరవ అధ్యక్షునిగా సుధాకర్ రాజు, బీవీకే రాజు, సుదర్శన్ రాజు, చంద్ర శేఖర్ రాజు, నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా వెంకట నరసింహ రాజు, కోశాధికారిగా పూర్ణ చందర్ రాజు, ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్ రాజు, రామ రాజు, కార్యదర్శులుగా పృథ్విరాజు, మోహన్ రాజు, ప్రచార కార్యదర్శిగా వికాస్ ఎన్నికయ్యారు.


