News November 7, 2025
భద్రాద్రి కలెక్టరేట్‌లో జాతీయ గీతాలాపన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన పాల్గొని వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్య్ర సమరంలో పోషించిన విశిష్ట పాత్రను అధికారులు స్మరించుకున్నారు.
Similar News
News March 24, 2026
క్షయ వ్యాధి నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలి: జేసీ

క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జేసీ నిశాంతి సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. జేసీ మాట్లాడుతూ.. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా జిల్లాలో క్షయ వ్యాధి నివారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారులు పాల్గొన్నారు.
News March 24, 2026
రాజీ మార్గంలో వివాదాల పరిష్కారం: మంచిర్యాల సీపీ

ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీమార్గంలో పరిష్కారం అవుతాయని తెలిపారు. చిన్నచిన్న తగాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బువృథా చేయవద్దన్నారు. రాజీకి అనువైన క్రిమినల్ కాంపౌండ్డబుల్ కేసులు,సివిల్,ఆస్తి విభజన, కుటుంబపరమైన కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.
News March 24, 2026
ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచేసిన స్విగ్గీ.. నెటిజన్ల అసహనం!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారం జొమాటో ₹13.50గా ఉన్న ఫీజును ₹14,90 చేసింది. తాజాగా స్విగ్గీ ₹14.99 నుంచి ₹17.58కి పెంచింది. చమురు ధరలు పెరగడం, ఇంధన కొరతే పెంపునకు కారణంగా తెలుస్తుండగా దీనిపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయని అంటున్నారు.


