News November 7, 2025

ధర్మారం: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

image

ధర్మారం కటికెనపల్లికి చెందిన బోనగిరి వెంకటేశం ఇంట్లో జరిగిన చోరీ కేసులో గడమల్ల సదన్ కుమార్(19)ను అరెస్ట్ చేసినట్లు SI ప్రవీణ్ తెలిపారు. వెంకటేశం OCT 25న ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవారం ఇంటికొచ్చే సరికి చోరీ జరిగిందని గుర్తించి PSలో ఫిర్యాదు చేశాడు. విచారణలో సదన్ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బంగారు, వెండి నగలు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌ చేసినట్లు SI చెప్పారు.

Similar News

News November 7, 2025

PCOD, PCOS రాకుండా ఉండాలంటే?

image

మారిన జీవనశైలి వల్ల చాలామంది అమ్మాయిలు PCOD, PCOS సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అధిక బరువుంటే వ్యాయామం చేస్తూ, సమతుల ఆహారం తీసుకుని బరువు తగ్గాలి. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్ట్రెస్‌ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.

News November 7, 2025

SKLM: సెకండ్ సాటర్డే సెలవులు రద్దు

image

రానున్న ఏడాది ఫిబ్రవరి నెల వరకు సెకండ్ సాటర్డే సెలవులు ఉండవని డీఈవో కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు యథావిధిగా జిల్లాలో పాఠశాలలు నడుస్తాయన్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా సెలవులను వీటి ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చాయని, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు.

News November 7, 2025

ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

image

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.