News November 7, 2025
జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి గజ్వేల్ విద్యార్థి ఎంపిక

SGF జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడలకు గజ్వేల్‌కు చెందిన హర్షవర్ధన్ ఎంపికయ్యాడు. వికారాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-14 ఫుట్‌బాల్ టోర్నీలో ప్రజ్ఞాపూర్ విద్యార్థి అయిన హర్షవర్ధన్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. చివరి మ్యాచ్‌లో నిజామాబాద్‌పై గోల్ చేసి మెదక్ జట్టును గెలిపించాడు. ఈ ప్రతిభతో హర్షవర్ధన్ జాతీయస్థాయి టోర్నమెంట్‌కు సెలక్ట్ అయ్యాడు.
Similar News
News March 12, 2026
గ్యాస్ కొరత.. రాష్ట్రంలోని హోటళ్ల కీలక నిర్ణయం

కమర్షియల్ గ్యాస్ కొరత, నిర్వహణ ఖర్చులపై AP హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు విజయవాడలో అత్యవసరంగా సమావేశమైంది. గ్యాస్ ఇబ్బందుల దృష్ట్యా స్టార్ హోటళ్లలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని పేర్కొంది. ప్రతి సోమవారం రెస్టారెంట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. కర్ణాటక తరహాలో కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతోందని తెలిపింది.
News March 12, 2026
కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన పెద్దపల్లి ఎంపీ

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ గాంధీపై ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. 2019లో అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చిన ఘటనలను ప్రజలు మరచిపోలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడం ప్రతి నాయకుడి బాధ్యత, ప్రజల తీర్పే తుది అని వంశీ కృష్ణ స్పష్టం చేశారు.
News March 12, 2026
కడప జిల్లాలో MSPతో శనగ పంట సేకరణ ఎంతంటే.!

కడప జిల్లాలో బుధవారం నాటికి 2438 మంది రైతుల నుంచి MSPతో 9963MTల శనగలను సేకరించారు. పెద్దముడియం-727, జమ్మలమడుగు-593, మైలవరం-267, ఎర్రగుంట్ల-782, కొండాపురం-335, ముద్దనూరు-822, ప్రొద్దుటూరు-630, రాజుపాలెం-724, కమలాపురం-1120, వల్లూరు-532, పెండ్లిమర్రి-811, VNపల్లె-603, పోరుమామిళ్ల-145, దువ్వూరు-93, వేంపల్లె-332, వేముల-530, సింహాద్రిపురం-217, తొండూరు-176, లింగాల-255, పులివెందుల-262MTలు సేకరించారు.


