News November 7, 2025
శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి NOV 14-JAN 21 మధ్య 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. మచిలీపట్నం-కొల్లామ్, నర్సాపూర్-కొల్లామ్, చర్లపల్లి-కొల్లామ్ మధ్య ఈ ట్రైన్స్ నడుస్తాయని పేర్కొంది. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం పైన ఫొటోలను స్వైప్ చేయండి.
Similar News
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.
News November 7, 2025
ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.
News November 7, 2025
తేనె మోతాదు మించితే మహా ప్రమాదం

ఆరోగ్యానికి మంచిదని ఇటీవల తేనెను ఎక్కువమంది స్వీకరిస్తున్నారు. అయితే దాని మోతాదు మించితే మొదటికే మోసమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. శరీరంలోని విషపదార్థాల తొలగింపులో కాలేయానిది ప్రధాన పాత్ర. అధిక తేనెతో దానిలో కొవ్వు పేరుకుపోయి పనితీరును నష్ట పరుస్తుంది. ఫలితంగా ఇతర సమస్యలూ వస్తాయి. అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరుగుతారు.


