News November 7, 2025

భారత్ స్వర్గధామంలాంటి ఆశ్రయం ఇచ్చింది: హసీనా

image

బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వంలో తీవ్రవాదులకు మద్దతునివ్వడం వల్ల ఇండియాతో సంబంధాలు దెబ్బతింటాయని ఆదేశ ex-PM షేక్ హసీనా అన్నారు. అవామీ లీగ్‌పై నిషేధంతో తన మద్దతుదారులు రానున్న ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేదని చెప్పారు. మైనారిటీలు దాడులకు గురవుతున్నారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టుకు ఆధారాలు సమర్పిస్తానన్నారు. భారత్ తనకు స్వర్గధామంలాంటి ఆశ్రయాన్ని కల్పించిందని ప్రశంసించారు.

Similar News

News November 7, 2025

PHOTO: రాజ్ నిడిమోరుతో సమంత

image

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ప్రచారం వేళ ఇన్‌స్టాలో సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఓ ఈవెంట్ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సామ్, రాజ్ క్లోజ్‌గా ఉన్న ఫొటో కూడా ఉంది. గత ఏడాదిన్నరగా తన జీవితంలో కొన్ని బోల్డ్ డెసిషన్‌లు తీసుకున్నానని, అందుకు కృతజ్ఞతగా ఉన్నట్లు ఆమె రాసుకొచ్చారు. దీంతో రాజ్‌తో తన బంధాన్ని ఆమె బహిరంగంగానే ప్రకటించారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

News November 7, 2025

₹67 లక్షల లోన్ తీర్చేసిన టెకీ.. అతడిచ్చే సూచనలివే!

image

6 ఏళ్లలో ₹67 లక్షల హోమ్ లోన్ తీర్చడంలో నేర్చుకున్న పాఠాలను చెబుతూ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘2019లో తీసుకున్న ₹53L లోన్‌ను ₹14L వడ్డీతో ఈ నెలలో కట్టేశా. సొంతిల్లు అంటే తొలుత ఎమోషనల్‌గా ఉన్నా తర్వాత సమస్యలొస్తాయి. మానసిక ఒత్తిడి వస్తుంది. రీపేమెంట్‌ ప్లాన్ ఉండాలి. ఇంటి విలువ పెరిగినా లిక్విడిటీ ఉండదు. లోన్ వల్ల కష్టపడి పనిచేస్తాం. ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది’ అని redditలో పేర్కొన్నాడు.

News November 7, 2025

ఫోన్ అడిక్షన్: 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారట!

image

ఇటీవల ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్‌లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ WeWard ఓ ఫొటో షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖంపై డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయని హెచ్చరించింది. పలు ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ‘Sam’ అనే మోడల్‌ను రూపొందించింది.