News November 7, 2025
నిజామాబాద్: మలావత్ పూర్ణకు పితృ వియోగం

అత్యంత పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. అంత్యక్రియలు సాయంత్రం ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News November 7, 2025
PHOTO: రాజ్ నిడిమోరుతో సమంత

డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ ప్రచారం వేళ ఇన్‌స్టాలో సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఓ ఈవెంట్ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇందులో సామ్, రాజ్ క్లోజ్‌గా ఉన్న ఫొటో కూడా ఉంది. గత ఏడాదిన్నరగా తన జీవితంలో కొన్ని బోల్డ్ డెసిషన్‌లు తీసుకున్నానని, అందుకు కృతజ్ఞతగా ఉన్నట్లు ఆమె రాసుకొచ్చారు. దీంతో రాజ్‌తో తన బంధాన్ని ఆమె బహిరంగంగానే ప్రకటించారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
News November 7, 2025
₹67 లక్షల లోన్ తీర్చేసిన టెకీ.. అతడిచ్చే సూచనలివే!

6 ఏళ్లలో ₹67 లక్షల హోమ్ లోన్ తీర్చడంలో నేర్చుకున్న పాఠాలను చెబుతూ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘2019లో తీసుకున్న ₹53L లోన్‌ను ₹14L వడ్డీతో ఈ నెలలో కట్టేశా. సొంతిల్లు అంటే తొలుత ఎమోషనల్‌గా ఉన్నా తర్వాత సమస్యలొస్తాయి. మానసిక ఒత్తిడి వస్తుంది. రీపేమెంట్ ప్లాన్ ఉండాలి. ఇంటి విలువ పెరిగినా లిక్విడిటీ ఉండదు. లోన్ వల్ల కష్టపడి పనిచేస్తాం. ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది’ అని redditలో పేర్కొన్నాడు.
News November 7, 2025
విషం తాగి యువకుడు ఆత్మహత్య

మదనపల్లెలో విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. 2టౌన్ సీఐ రాజారెడ్డి వివరాల మేరకు.. రామారావుకాలనీకి చెందిన నాగరాజ కొడుకు శివ(24)ను కుటుంబీకులు మందలించారు. మనస్థాపానికి గురైన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయించి, తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


