News November 7, 2025

విశాఖ: ఎయిర్‌పోర్ట్ రహదారిలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

షీలానగర్ నుంచి ఎన్ఏడీ వైపు వస్తున్న రహదారిలో శుక్రవారం యాక్సిడెంట్ జరిగింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీస్తున్నారు.

Similar News

News February 12, 2026

విశాఖ: 18 ఏళ్లుగా తప్పించుకుంటున్న నిందితుడి అరెస్ట్

image

18 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్ రెహనుల్లా సిద్ధిఖీని విశాఖ 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2002 నుంచి పరారీలో ఉన్న ఇతనిని గాండీవ యాప్, పాన్ (PAN) వివరాల ఆధారంగా చెన్నైలో గుర్తించారు. నిందితుడిపై హత్యతోపాటు పలు కేసులు ఉన్నాయి. ఎస్సై బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.

News February 12, 2026

విశాఖ: ఫ్లైట్స్ షెడ్యూల్స్‌లో మార్పులు చూసుకున్నారా..!

image

విశాఖలో ఫిబ్రవరి 15-19 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026 నౌకాదళ విన్యాసాల నేపథ్యంలో విమానాశ్రయంలో షెడ్యూల్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సవరించింది. రోజూ ఉదయం 10.45-12.30, సాయంత్రం 4-5.30, 6.30-7.30 మధ్య వైమానిక మార్గం తాత్కాలికంగా మూసివేయనున్నారు. 16 విమానాల రాకపోకలు మారాయి. చెన్నై-విశాఖ-చెన్నై 6E581, 6E881 సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.

News February 12, 2026

విశాఖలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

విశాఖపట్నం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ జి.విలియమ్స్ సాప్ (SAAP) లీగ్స్ జిల్లా స్థాయి ఎంపికల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో చదరంగం, 24న బీచ్ రోడ్డులో సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో సాప్ (SAAP) అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు.