News November 7, 2025
సంగారెడ్డి: ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాన్ని శుక్రవారం ఆలపించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్ రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్‌రావ్, ఆర్ఐలు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావ్, ఆఫీసు సూపరింటెండెన్స్ అశోక్, మెహనప్ప, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 15, 2026
విశాఖ: టెన్త్ పరీక్షలు రాసేవారికి బస్సులో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షల దృష్ట్యా, విద్యార్థులు హాల్ టికెట్ చూపి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రకటించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News March 15, 2026
గ్యాస్ కోసం ఆందోళన అవసరం లేదు: విశాఖ జేసీ

విశాఖ జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ విద్యాధరి ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్‌నకు రోజువారీ అవసరము 18,184 సిలిండర్‌లు కాగా 37,920 సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుకింగ్ చేసుకోవాలనన్నారు. కేవలం పుకార్ల వల్ల మాత్రమే బుకింగ్స్ పెరిగాయని ఆమె పేర్కొన్నారు.
News March 15, 2026
నిబంధనల మేరకు పక్కాగా సర్వే నిర్వహించాలి: కలెక్టర్

ప్రభుత్వం సూచించిన విధంగా నిబంధన ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి, జనాభా గణన చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జనాభా లెక్కలు – 2027, శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. మొదటి దశ హౌసింగ్ లిస్ట్ మే 11 నుంచి జూన్ 9, రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుందన్నారు. మార్చి 1, 2027 రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తామన్నారు.


