News November 7, 2025
VKB: వందేమాతరం దేశ సమైక్యతకు తోడ్పడుతుంది: కలెక్టర్

వందేమాతరం జాతీయగీతం దేశ సమైక్యతకు తోడ్పడుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో కలిసి సామూహిక వందేమాతరం గేయం ఆలపించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News March 20, 2026
గద్వాల: టెన్త్ పరీక్షలు పకడ్బందీగా జరపాలి – కలెక్టర్

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించిన ఆయన, జిల్లాలో పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
News March 20, 2026
2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం: సూర్యాపేట కలెక్టర్

2027 జనాభా గణన దేశాభివృద్ధికి, పథకాల అమలుకు అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, తొలిసారిగా డిజిటల్ విధానంలో గణన జరుగుతుందని పేర్కొన్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశ ఇళ్ల జాబితా నమోదు ఉంటుందని, ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు.
News March 20, 2026
నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

కర్నూలు నగరాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్‌ను ప్రారంభించారు. కమిషనర్ పి.విశ్వనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగర పరిపాలనలో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం తన కార్యాలయంలో కేఎంసి పూర్తి మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.


