News November 7, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఏఎస్పీగా అంకిత మహవీర్

image

పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా అంకిత సురానా మహవీర్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతామని, మహిళలు, చిన్నారుల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని ఏఎస్పీ ఎస్పీ పేర్కొన్నారు. తొలుత ఎస్పీ కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.

Similar News

News March 28, 2026

రైతులకు ఐడీ కార్డులు.. ₹215 కోట్లతో ప్రోత్సాహకాలు

image

TG: రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయనుంది. వీటి ద్వారా లోన్లు, మార్కెటింగ్ సదుపాయాలు ఈజీగా అందుతాయి. ₹215 కోట్ల బడ్జెట్‌తో పందిళ్లు, యంత్ర పరికరాలపై 50% సబ్సిడీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో సాగు విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకూ సహకారం అందించనుంది.

News March 28, 2026

లింగాపూర్: చెరువులో గుర్తుతెలియని మహిళ శవం లభ్యం

image

లింగాపూర్ గ్రామ శివారులోని చెరువులో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ (35-40 ఏళ్లు) శవం లభ్యమైందని దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎవరైనా ఈ మహిళను గుర్తించినట్లయితే వెంటనే దేవునిపల్లి పోలీస్ స్టేషన్ నందు సంప్రదించాలని ఆయన కోరారు. దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

News March 28, 2026

HYDలో దంచికొట్టిన వర్షం.. రికార్డు వివరాలు ఇవే..!

image

HYD నగరంలో రాత్రి వర్షం దంచికొట్టింది. పాత GHMC పరిధి అల్వాల్ అంబేడ్కర్ నగర్‌లో అత్యధికంగా 14.0 మి.మీ వర్షం కురిసింది. కాప్రా, కుషాయిగూడలో 13.8 మి.మీ, వెస్ట్ మారేడ్పల్లిలో 13.0 మి.మీ వర్షం పడింది. నేరెడ్‌మెట్, ఆనంద్ బాగ్, మౌలాలి, సఫిల్‌గూడ ప్రాంతాల్లో 12 మి.మీకి పైగా వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. వేసవి వేళ వర్షం కాస్త ఉపశమనం కలిగించి.