News November 7, 2025
HYD: KTR.. రాసిపెట్టుకో..!: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRS పార్టీ పతనానికి రెఫరెండమని, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరంకొట్టారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ మీ సీటు గాయబే.. ఇక్కడి నుంచి మీ పార్టీ కనుమరుగు కావడం ఖాయం.. రాసిపెట్టుకో KTR’ అని పేర్కొంది. కాగా జూబ్లీహిల్స్‌లో BRS గెలవదని, కచ్చితంగా తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 21, 2026
లింకేజీ రుణాల్లో జనగామ వెనుకంజ..!

స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి ఏటా వారి సంక్షేమానికి రూ.కోట్లు వెచ్చిస్తోంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో లింకేజీ రుణాల లక్ష్యం రూ.460 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రూ.353 కోట్లు మాత్రమే లింకేజీ రుణాలు అందించడం జరిగింది. దీంతో రుణాల మంజూరులో జిల్లా వెనుకబడింది.
News March 21, 2026
USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
News March 21, 2026
వెంకట్రావుపేటలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో శనివారం ఉరివేసుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వెంకట్రావుపేటలోని పెద్దమ్మ తండాకి చెందిన జరుఫుల రమేశ్ అనే వ్యక్తి గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలే ఆయన మృతికి కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


