News November 7, 2025

HYD: శబరిమల స్పెషల్ ట్రైన్.. బుకింగ్ షురూ

image

శబరిమల కోసం HYD చర్లపల్లి నుంచి 07107 స్పెషల్ ట్రైన్ నవంబర్ 17 నుంచి సేవలు అందించనుంది. కొల్లం జంక్షన్ వరకు ఇది వెళుతుందని అధికారులు తెలిపారు. ఈ రైలుకు సంబంధించి నేడు ఉదయం 8 గంటలకు బుకింగ్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు అందరూ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని, ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది.

Similar News

News March 19, 2026

రాజంపేట: వర్షంతో రైతులకు నష్టం

image

రాజంపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. హస్తవరం, చెర్లోపల్లి, కొత్తపల్లి, ఆకేపాడు తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో అరటి పంటలు నేలకొరిగాయి. పంట కోత దశలో ఉండగా, ఒకే రాత్రిలో నాశనం కావడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన పంటలపై సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

News March 19, 2026

సంస్కృతికి ప్రతీక ఉగాది పచ్చడి: ఎస్పీ

image

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణాన్ని SP రాజేష్ చంద్ర, ఇతర పోలీస్ అధికారులు ఆలకించారు. కార్యక్రమం అనంతరం SP స్వయంగా ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఉగాది పచ్చడి అనేది కేవలం ఆరు రుచుల మిశ్రమం మాత్రమే కాదని, అది మన భారతీయ సంస్కృతికి, జీవిత సత్యాలకు ప్రతీక అని SP పేర్కొన్నారు.

News March 19, 2026

‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది!

image

‘ధురంధర్-2’ భారత సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ‘బుక్ మై షో’లో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు పుష్ప-2 (1.07 లక్షలు) పేరిట ఉండేది. వీకెండ్స్‌లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని, భారీ కలెక్షన్లు పక్కా అని నెటిజన్లు అంటున్నారు. కాగా గతేడాది వచ్చిన ధురంధర్ దాదాపు రూ.1,350 కోట్లు వసూలు చేసింది.