News November 7, 2025

రెబ్బెన: హత్య కేసు నిందితుడు పరార్!

image

హత్య కేసులో విచారణ కోసం తీసుకొచ్చిన ఓ నిందితుడు రెబ్బెన పోలీస్ స్టేషన్ నుంచి పరారు కావడం కలకలం రేపింది. చేతికి వేసిన సంకెళ్లతో స్టేషన్ నుంచి పారిపోయినట్లు సమాచారం. 5 రోజుల క్రితం తిర్యాణి మండలం పిట్టగూడాకి చెందిన హన్మంత్ రావును అదే గ్రామానికి చెందిన సిడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు. దీంతో వినోద్‌ను పోలీసులు తీసుకొచ్చి విచారించారు. కాగా 4 రోజులుగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 21, 2026

విశాఖ: ‘సోషల్ మీడియాలో జాబ్స్ ప్రకటనలు నమ్మవద్దు’

image

హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన కేంద్రం పేరుతో నర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులపై సోషల్ మీడియాలో నకిలీ నియామక ప్రకటనలు వెలుగు చూశాయి. పోస్టుల సంఖ్య, జీతం, అర్హతలు, చివరి తేదీ వివరాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆసుపత్రి నుంచి విడుదల కాలేదని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే సమాచారం ధ్రువీకరించుకోవాలని సూచించారు.

News March 21, 2026

నల్గొండ- మాచర్ల రైల్వే మార్గంపై వీడని నిరీక్షణ

image

నల్గొండ నుంచి హాలియా మీదుగా మాచర్ల వరకు రైల్వే లైన్ కల సాకారం కోసం సాగర్ ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్లలో కేంద్రం రూ.2 కోట్లు కేటాయించి, రెండుసార్లు సర్వే నిర్వహించినా పనులు మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి, ఈ నిరీక్షణకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 21, 2026

విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎల్సీ యాప్: ఎస్ఈ

image

విద్యుత్ ఉద్యోగుల భద్రత, ప్రమాదాల నివారణకు కొత్తగా ఎల్సీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ గౌతమ్ రెడ్డి తెలిపారు. డిజిటల్ పద్ధతిన లైన్ క్లియర్ విధానం అమలులోకి వచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి లీడర్ వివరాలు పని చేయాల్సిన స్థానం వివరంగా కనిపిస్తాయని చెప్పారు.