News November 7, 2025
జగిత్యాల: నీటిలో మునిగి యువకుడు మృతి

జగిత్యాల(D) ఇబ్రహీంపట్నం మం. మూలరాంపూర్ శివారులోని సదర్ మార్ట్ ప్రాజెక్ట్ వద్ద చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీటిలోపడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌కు చెందిన పల్లికొండ సిద్దార్థ(18) బుధవారం చేపలుపట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించినట్లు తండ్రి గంగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News March 25, 2026
నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీ

నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ జి.శివయ్య బుధవారం సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. వార్షిక ఆదాయం, రిజిస్ట్రేషన్ల విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భీమవరం పరిధిలోని 15 కార్యాలయాల ద్వారా ఈ నెల 23 నాటికి రూ.425.17 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం విధుల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News March 25, 2026
GNT: రేపు పోలీస్ కండెమినేషన్ వస్తువుల బహిరంగ వేలం

గుంటూరు (D) పోలీస్ శాఖకు చెందిన పాత వస్తువుల బహిరంగ వేలం మార్చి 26న నిర్వహించనున్నారు. SP వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం 4 గ. RI స్టోర్‌లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పాత టెంట్లు, కుర్చీలు, సమియానాలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, ఫ్యాన్లు, టార్చ్‌లైట్లు, వివిధ రకాల వస్తువులను వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చని చెప్పారు.
News March 25, 2026
నెల్లూరు: పేరుకే నగర పంచాయతీలు..!

బుచ్చి, అల్లూరుకు జనాభాను చూసి నగర పంచాయతీల హోదా ఇచ్చారు. కానీ ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి నామమాత్రమే. ప్రజల నుంచి ఆస్తి, కొళాయి పన్నులను వసూలు చేస్తున్నా నగర ప్రాంతానికి ఉండాల్సిన హంగులు లేవు. కనీసం డివైడర్ల రూపు రేఖలు మారడం లేదు. ఎక్కడ చూసినా మురుగు, వ్యర్థాలతో నిండిపోతున్నాయి. బుచ్చిలో 42 వేలు, అల్లూరులో 35 వేలకు పైగా జనాభా ఉన్నా వసతులు లేవు. పాలకులు వీటి అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సి ఉంది.


