News November 7, 2025
VZM: సబ్సిడీ కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు

సఫాయి కర్మచారి యువతకు NSKFDC పథకం కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు SC కార్పొరేషన్ ED వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు వాహనాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఐదుగురు సఫాయి కర్మచారులు కలిసి గ్రూపుగా దరఖాస్తు చేసుకోవాలని, వారిలో ఒకరికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News March 22, 2026
VZM: సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం

విజయనగరం జిల్లాలో సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్‌ను నియమించినట్లు జిల్లా గనులు భూగర్భ శాఖాధికారి సూర్య చంద్రరావు ఆదివారం తెలిపారు. ఈనెల 23 నుంచి జూన్ 16 వరకు ఇసుక, రాయి, మట్టి, గ్రానైట్ వంటి ఖనిజాలు తీసుకునే వారి నుంచి ఈ సంస్థ నిర్ణీత సీనరేజ్ ఛార్జీలను వసూలు చేయనుంది. లీజుదారులు, ప్రజలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహకరించాలని కోరారు.
News March 22, 2026
VZM: విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల అనంతరం ఖాళీ సమయంలో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు వంటి జలవనరుల వద్దకు వెళ్లే అవకాశముండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వాలని ఆయన కోరారు.
News March 22, 2026
VZM: రాములోరి కళ్యాణానికి భక్తులకు ఆహ్వానం

మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రామతీర్ధం శ్రీ సీతారామస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ఉత్తరాంధ్ర భక్తులు తరలిరావాలని ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు శనివారం కోరారు. కళ్యాణంలో పాల్గొనాలనుకునే దంపతులు రూ.1500 టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ ఆలయం వద్ద టికెట్లు లభ్యమవుతాయని, పాల్గొనే వారికి శేషవస్త్రాలు, తలంబ్రాలు, ప్రసాదం అందిస్తామన్నారు.


