News November 7, 2025

ఎల్లంపల్లి ప్రాజెక్టు తాజా సమాచారం

image

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు నీటి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఉదయం 10:30 గంటల సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లు, నిల్వ 20.18 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్ట్‌కు మొత్తం 27,624 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. HMWSకు 299, NTPCకి 121 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా 27,204 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 7, 2026

నెల్లూరు మున్సిపల్ అధికారులు వార్నింగ్

image

నెల్లూరు నగరంలో రూ.44 కోట్ల పన్ను బకాయిలు పేరుకుపోవడంతో మున్సిపల్ అధికారులు సీరియస్ అయ్యారు. మార్చి 31 డెడ్ లైన్ కావడంతో, సుమారు 14,300 మంది మొండి బకాయిదారులకు లోక్ అదాలత్ నోటీసులు జారీ చేస్తున్నారు. గత ఏడాదిలా 50% రాయితీ వస్తుందని ఆశించి పన్ను ఆపేయవద్దని, అలా చేస్తే ఇంటి నల్లా కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారీ బకాయిలు ఉన్న హోటళ్లు, మాల్స్, ఇండస్ట్రీలపై నిఘా పెట్టారు.

News March 7, 2026

గుంటూరు: విద్యుత్ శాఖకు రూ.450 కోట్ల బకాయిలు

image

విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో గుంటూరు, సీఆర్డీఏ, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కలిపి రూ.450 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు సర్కిల్‌లోనే రూ.203 కోట్లు బకాయి కాగా పల్నాడు ప్రాంతంలో రూ.250 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఈ వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రైవేటు వినియోగదారులకు నోటీసులు ఇస్తున్నారు.

News March 7, 2026

అల్లు అర్జున్‌తో శిల్పా రవి

image

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.