News November 7, 2025
HYD: ఎన్నికల సమయంలో సోదాలు సహజం: పొన్నం

ఎన్నికల సమయంలో సోదాలు జరగడం సహజమని, అవి ఎవరి ఇంట్లో అయినా చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు సోదాలు నిర్వహించడం ఎన్నికల సంఘం హక్కని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
Similar News
News March 27, 2026
హైదరాబాద్: రూ. 217 కోట్ల భారీ జీఎస్‌టీ స్కామ్

తెలుగు రాష్ట్రాల్లో రూ. 217 కోట్ల జీఎస్‌టీ కుంభకోణాన్ని డీజీజీఐ (DGGI) అధికారులు ఛేదించారు. 72 షెల్ కంపెనీల ద్వారా ఎలాంటి వస్తు సరఫరా లేకుండానే రూ. 1,472 కోట్ల నకిలీ లావాదేవీలు సృష్టించినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి, అక్రమంగా ఐటీసీ (ITC) క్లెయిమ్ చేశారు. హైదరాబాద్, ఏపీల్లో జరిపిన దాడుల్లో కీలక సాక్ష్యాధారాలు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News March 27, 2026
మన్యంకొండలో వైభవంగా సీతారాముల కళ్యాణం

మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ దివ్య ఘట్టాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. రేపు ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
News March 27, 2026
అల్లూరి: ఈతకు వెళ్లి బాలుడు మృతి

హుకుంపేట(M) కామ్మయ్య పేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాంగి సాకేత్(8) స్నేహితులతో ఆడకుంటూ తీగలవలస పంచాయతీ, రాతులపుట్టు గెడ్డలో ఈత వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసినా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.


