News November 7, 2025

జిల్లాలో పెరుగుతున్న చలి పులి..!

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. అత్యల్పంగా మన్నెగూడెంలో 17.4℃, గోవిందారం 17.6, కథలాపూర్ 17.8, గోల్లపల్లి, రాఘవపేట 18.0, మల్లాపూర్ 18.1, పెగడపల్లె, నేరెళ్ల, జగ్గసాగర్ 18.3, తిరుమలాపూర్, మేడిపల్లె, సారంగాపూర్, పూడూర్, ఐలాపూర్ 18.4, జగిత్యాల 18.9, మెట్‌పల్లి 19.3, ఎండపల్లి, సిరికొండ, గుల్లకోటలో 19.9℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News March 14, 2026

రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: ఆకాశ్ చోప్రా

image

IPL-2026లో MI తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్‌గా కాకుండా పూర్తిస్థాయి ప్లేయర్‌గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. రోహిత్ ప్రస్తుతం గతంలో కంటే ఫిట్‌గా ఉన్నారని, ఆయన సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్దిక్‌కు హెల్ప్ అవుతుందని అభిప్రాయపడ్డారు. గత సీజన్‌లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేశారు.

News March 14, 2026

కోదాడలో కల్తీ వంటనూనె కలకలం

image

కోదాడ పట్టణంలో కల్తీ వంటనూనె తరలిస్తున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో ట్యాంకర్, ఆటోను తనిఖీ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపారు. కల్తీ అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రజలు ఆహార కల్తీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News March 14, 2026

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

image

భారత్‌లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది. 2025 FEBతో పోలిస్తే ఇది 10% అధికం. 2, 3 వీలర్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్(18,71,406) 35.2%, 3 వీలర్ సేల్స్(74,573) 29% పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి, 2 వీలర్లలో హీరో మోటోకార్ప్ టాప్‌లో నిలిచాయి.