News November 7, 2025

సిరిసిల్ల: ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ సిద్ధం: కలెక్టర్

image

రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ (యూనిఫామ్స్) సిద్ధమవుతున్నాయని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసే ఈ చీరల ఉత్పత్తి ప్రక్రియ, ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శుక్రవారం హాజరయ్యారు.

Similar News

News April 3, 2026

రాముడిగా తెలుగు హీరోల్లో ఎవరు బాగుంటారు?

image

ప్రస్తుత తెలుగు హీరోల్లో శ్రీ రాముడి గెటప్‌లో ఎవరు బాగుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా ‘రామాయణ’ టీజర్‌లో రణ్‌బీర్ రాముడిగా కనిపించడం, ‘వారణాసి’లో మహేశ్ బాబు కూడా ఆ పాత్రలో నటిస్తుండటంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని రాముడిగా చూడాలని కోరుకుంటున్నారు. మరి తెలుగు హీరోల్లో ఎవరు బాగా సెట్ అవుతారు? ఎవరు బాగా నటించగలరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News April 3, 2026

ముగిసిన సలేశ్వరం జాతర.. అధికారుల ప్రకటన

image

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని నల్లమల అడవుల్లోని సలేశ్వరం లింగమయ్య జాతర నేటితో అధికారికంగా ముగిసింది. అటవీ శాఖ అనుమతి గడువు ముగియడంతో భక్తులు పరిస్థితిని గమనించి అధికారులకు సహకరించాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. అటవీ మార్గంలో ప్రయాణించేటప్పుడు క్రమశిక్షణతో ఉంటూ, సురక్షితంగా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. కాగా అధికారుల ప్రకటనతో గడువు పొడిగింపు లేదని స్పష్టమైంది. SHARE IT

News April 3, 2026

విశాఖ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు

image

విశాఖలో గురువారం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధరించనవి-1183, పిలియన్ రైడర్-242, ట్రిపుల్ రైడింగ్-66, ఆటోలపై కేసులు-3, ఓవర్ స్పీడ్-185, సెల్ఫోన్ డ్రైవింగ్-28, ఓవర్ స్పీడ్-185, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-95, రాంగ్ పార్కింగ్-209, డ్రంకెన్‌ డ్రైవ్-35, సీజ్ చేసిన వెహికల్స్-52, MVయాక్ట్ ఉల్లంఘన-441తో కలిపి మొత్తం 2,363 కేసులు నమోదయ్యాయి.