News November 7, 2025
సిరిసిల్ల: సిద్ధమవుతున్న 64 లక్షల చీరలు

SHG సభ్యులకు పంచడానికి 64 లక్షల చీరలు సిద్ధమవుతున్నాయని సిరిసిల్ల ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్లలో తయారవుతున్న ఇందిరా మహిళా శక్తి చీరలను 32 జిల్లా సమాఖ్యల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శుక్రవారం పరిశీలించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి కింద మహిళలకు చీరలు అందజేయడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని వేలాదిమందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు.
Similar News
News March 18, 2026
JN: వల్మీడి బ్రహ్మోత్సవాలు.. సమన్వయంగా పనిచేయాలి: కలెక్టర్

పాలకుర్తి మండలం వల్మిడిలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సమీక్ష నిర్వహించారు. డీసీపీ, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో చర్చించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
News March 18, 2026
జనగామ: పది పరీక్షలకు 99.95 శాతం హాజరు

జనగామ జిల్లాలోని 39 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు 99.95 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. మొత్తం 6430 మంది విద్యార్థులకు గాను 6427 మంది హాజరయ్యారని, ముగ్గురు గైర్హాజరయ్యారని తెలిపారు. రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ తెలిపారు.
News March 18, 2026
BHPL: డిప్యూటీ తహశీల్దార్‌లకు పదోన్నతులు

రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ సీసీఎల్ఏ అధికారి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు నలుగురు తహశీల్దార్లు నియమితులయ్యారు. ములుగు నుంచి రాపల్లి రాజేశ్వరరావు, కరీంనగర్ నుంచి టి.వసంత్ రావు, టి.స్వరూప రాణి, వరంగల్ నుంచి అడ్లూరి రాజేశ్వర్ రావులకు భూపాలపల్లి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. త్వరలోనే వీరు విధుల్లో చేరనున్నారు.


