News November 7, 2025

కరీంనగర్ కలెక్టరేట్‌లో ‘వందేమాతరం’ గీతాలాపన

image

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరీంనగర్ కలెక్టరేట్‌లో శుక్రవారం ఉద్యోగులు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 17, 2026

జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి గరిష్ఠ ధర

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం గరిష్ఠంగా రూ.7,500 పలికిన పత్తి ధర నేడు రూ.50 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. మార్కెట్‌కు మొత్తం 24 వాహనాల్లో 145 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News March 15, 2026

KNR: ‘స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం’

image

స్కిల్ డెవలప్‌మెంట్‌తోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలంగాణ విఠల్ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూర అశోక్ అన్నారు. కరీంనగర్ ఫిలిమ్ భవన్లో డా.బీఎన్.రావు అధ్యక్షతన ‘ఉద్యోగ సమస్య – పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సహజ వనరులు అధికంగా ఉన్న తెలంగాణలో రాజకీయ వనరులకోసం పరిపాలన జరుగుతుంది తప్ప ఉత్తమ ఉద్యోగ పాలసీని తయారు చేయలేక పోతున్నారని విమర్శించారు.

News March 15, 2026

కరీంనగర్: ఎస్సీ యువతకు GOOD NEWS

image

జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025 -26 ఎస్సీ వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం రవాణా, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తునట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆసక్తిగల ఎస్సీ అభ్యర్థులు ఓబీ ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 17 నుంచి 24 వరకు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.