News November 7, 2025
హెయిర్ డై వేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఒక్క తెల్లవెంట్రుక కనబడగానే కంగారు పడిపోయి జుట్టుకు రంగులువేస్తుంటారు చాలామంది. అయితే హెయిర్ డై వేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇన్‌స్టాంట్ కలర్ ఇచ్చే బ్లాక్ హెన్నా, షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. సల్ఫేట్లు, అమోనియా పెరాక్సైడ్, PPD లేనివి ఎంచుకోవాలి. తలస్నానం చేసి కండిషనర్ రాశాకే రంగు వేయాలి. ముఖానికి, మాడుకు మాయిశ్చరైజర్ రాసి, తర్వాత డై వేసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News March 16, 2026
ఆస్కార్స్‌లో మెరవనున్న భారతీయ అందం

లాస్ ఏంజెలిస్‌లో రేపు ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఇండియన్ టైమ్ ప్రకారం తెల్లవారుజామున 4.30 గంటలకు అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం మొదలవుతుంది. వేదికపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా సందడి చేయనున్నారు. పలువురు విజేతలకు ఆమె ఆస్కార్ అవార్డులు ప్రజెంట్ చేస్తారు. గతంలో ‘నాటు నాటు’ పాటకు అవార్డు వచ్చినప్పుడు దీపికా పదుకొణె అంతర్జాతీయ స్టేజీపై మెరిసిన విషయం తెలిసిందే.
News March 15, 2026
‘ఉస్తాద్’ అందుకే లేట్ అయింది: హరీశ్ శంకర్

కథ మారినందుకే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఆలస్యమైందని ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ హరీశ్ శంకర్ తెలిపారు. తొలుత అనుకున్న స్టోరీ సెట్ కాకపోవడంతో స్క్రిప్ట్ మార్చడం, కరోనా వంటి కారణాలతో లేట్ అయిందన్నారు. ఈ జర్నీలో ప్రొడ్యూసర్స్, పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇక మూవీ ఆలస్యంపై కొందరు కథలుకథలుగా మాట్లాడుకున్నారని, అది సృష్టి ధర్మమని హరీశ్ సెటైర్ వేశారు. ఈ సారి పండుగ ఉస్తాద్ ఉగాది అన్నారు.
News March 15, 2026
ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం ఉంటుందని APSDMA అంచనా వేసింది. ద్రోణి, నైరుతి నుంచి వీచే గాలులతో రేపు SKLM, VZM, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసేందుకు ఆస్కారం ఉందని చెప్పింది.


