News November 7, 2025

ములుగు జిల్లాకు ఎంపీఓల కేటాయింపు

image

ములుగు జిల్లాకు ముగ్గురు నూతన మండల పంచాయతీ అధికారుల(ఎంపీఓ)ను ఉన్నతాధికారులు కేటాయించారు. ఏటూరునాగారం ఎంపీఓగా పి.వినయ్, తాడ్వాయికి జి.మహేందర్, నూగురు వెంకటాపురానికి జి.జమ్మిలాల్‌ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం నూతన ఎంపీఓలు కలెక్టర్ దివాకర్ టీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్-2 అధికారులు జిల్లాకు ఎంపీఓగా రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 10, 2026

నిర్మల్: రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం

image

నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం. మంజులాపూర్‌కు చెందిన సృజన్, నటరాజ్ నగర్‌కు చెందిన పృథ్వీరాజ్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. సృజన్ అక్కడికక్కడే మృతిచెందగా, పృథ్వీరాజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోగా చనిపోయాడు. చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.

News March 10, 2026

SKLM: పశువుల అక్రమ రవాణ.. ఇద్దరిపై కేసు నమోదు

image

లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని అడ్డుకున్నామని ఎస్సై అప్పలసూరి తెలిపారు. సోమవారం పశువుల వాహనం వెళుతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్నామని ఆయన వివరించారు. బుడుమూరు వద్ద తనిఖీ చేయగా కోటబొమ్మాళి మండలం నారాయణ వలస సంత నుంచి ఆలమండకు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. కరగాన రాజు, కె.వెంకట్‌లపై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.

News March 10, 2026

నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

image

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.