News November 7, 2025
ఇళయరాజా కచేరీకి పటిష్ఠ బందోబస్తు: సీపీ

రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్ కోసం సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఏసీపీ దామోదర్‌ను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షరీనా బేగం పాల్గొన్నారు.
Similar News
News March 21, 2026
కీచక జ్యోతిషుడితో లింక్స్.. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాజీనామా

నాసిక్(MH) <<19426361>>జ్యోతిషుడు<<>> అశోక్ కారత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతడితో ఉన్న ఫొటోలు, లింక్స్ బయటపడటంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రూపాలి చకన్కర్ రాజీనామా చేశారు. అంతకుముందు ఆ పదవి నుంచి దిగిపోవాలని MH సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రూపాలి ఈ నెల 18 నుంచి ఆఫీసుకు వెళ్లడం లేదని తెలిసింది.
News March 21, 2026
అనకాపల్లి: స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో 4గురు కేంద్ర మంత్రులు

నక్కపల్లిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదగా జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో నలుగురు కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ,పి. చంద్రశేఖర్ పాల్గొనున్నారు. వీరితో పాటు స్టీల్ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ హాజరవుతారు.
News March 21, 2026
తమిళనాడులో AIADMKదే పైచేయి?

తమిళనాడు ఎన్నికల్లో ఈసారి AIADMKదే పైచేయి అని IANS సర్వే పేర్కొనడం చర్చనీయాంశమైంది. AIADMK కూటమికి 39-40% ఓట్ షేర్ రావొచ్చని.. ఫలితంగా 234 స్థానాల్లో 114-127 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. DMK కూటమికి 104-114 సీట్లు (37-38% ఓట్ షేర్) దక్కొచ్చని పేర్కొంది. ఇక విజయ్ TVKకి 6-12 సీట్లు (14-15% షేర్) రావొచ్చని, అనేక స్థానాల్లో TVK కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చింది. <<-se>>#Elections2026<<>>


