News November 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ఓటు ఇక్కడే.. వాళ్లిక్కడలేరు..!

image

ఓటింగ్ శాతం పెరిగితే, గెలుపు అవకాశాలను పెరుగుతాయని ప్రధాన పార్టీలు స్థానికంగాలేని ఓటర్ల కోసం వెతుకుతున్నాయి. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. ఆయా ఫ్యామిలీ, బంధువులు, మిత్రులతో మాట్లాడి వారిని రప్పించడయ్యా.. ప్రయాణ ఖర్చులతో పాటు అదనపు డబ్బలిస్తాం. వాళ్లని ఇక్కడికి తీసుకురమ్మని డబ్బులిచ్చే పనిలో పడ్డారు. ‘ఎలక్షన్ టైమ్‌‌లో తప్ప మమ్మల్నెవరు పట్టించుకుంటారు’అని ప్రజలు అనుకుంటున్నారు.

Similar News

News November 7, 2025

GDK: బంగారు పతకాలు అందుకున్న ఎంబీఏ విద్యార్థులు

image

గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళాశాలకు చెందిన ఆరుగురు ఎంబీఏ విద్యార్థులు బంగారు పతకాలను అందుకున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించినందుకు గాను డీ.తరుణ, ఎం.మౌనిక, డీ.ఉషశ్రీ, పీ.కళ్యాణి, కే.కళ్యాణి, సీహేచ్‌.సాగరికలు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా ఈ బంగారు పతకాలు అందుకున్నారు.

News November 7, 2025

GNT: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

శంకర కంటి ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 9న సీఎం చంద్రబాబు విచ్చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పెదకాకాని మండలంలో హెలిపాడ్, సీఎం పాల్గొనే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News November 7, 2025

గోదావరిఖని ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ అభినందనలు

image

గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందించారు. అక్టోబర్ నెలలో 240 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించిన బృందాన్ని ఆయన సన్మానించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.