News November 7, 2025
MBNR: FREE కోచింగ్.. ఫోన్ చేయండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళలకు ఎస్‌బీఐ, RSETI ఆధ్వర్యంలో ఉచితంగా బ్యూటీ పార్లర్ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. 19 నుంచి 45 ఏళ్లలోపు వారు ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణతోపాటు వసతి కూడా కల్పిస్తారు. పూర్తి వివరాల కోసం 98481 42489 నంబరులో సంప్రదించాలని కోరారు.
Similar News
News November 8, 2025
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

గుంటూరులో నిర్వహించిన పోలీసు సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ 13 వినతులను స్వీకరించారు. బదిలీలు, ప్రమోషన్లు, క్వార్టర్స్ కేటాయింపు, వైద్య సాయం వంటి పలు అంశాలపై వినతులు వచ్చాయి. వీటిని నిష్పాక్షికంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
News November 8, 2025
నర్సాపూర్ (జి): ఫిడే వరల్డ్ చెస్ కప్-2025 ఆర్బిటర్‌గా అరుణ్ కుమార్

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) గ్రామ వాసి గాడి అరుణ్ కుమార్ ఫిడే వరల్డ్ చెస్ కప్ -2025కి ఆర్బిటర్‌గా(నిర్ణేత) ఎంపికయ్యారు. గోవాలో నవంబర్ 27 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 83 దేశాల నుంచి 206 మంది ఆటగాళ్లు పాల్గొనే మెగా ఈవెంట్‌కు ఆర్బిటర్‌గా అరుణ్ కుమార్ ఎంపిక కావడం నిర్మల్ జిల్లాకే గర్వకారణమని మండల వాసులు అభినందిస్తున్నారు.
News November 8, 2025
కరీంనగర్: ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ

KNR-1 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేసినట్లు DM విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో అన్నవరం, పిఠాపురం 10వ శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ కైలాస గిరి బీచ్, ద్వారక తిరుమల దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. NOV 11న ఉ.5 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి NOV 13న KNR చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,625 అన్నారు. వివరాలకు 7382849352 సంప్రదించాలన్నారు.


