News April 11, 2024

చైనాలో కోరింత దగ్గు విజృంభణ

image

కరోనా తర్వాత చైనాను మరో జబ్బు వణికిస్తోంది. ఆ దేశంలో కోరింత దగ్గు కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మునుపెన్నడూ లేనంతగా ప్రజలు ఈ వ్యాధి బారినపడ్డారు. 13మంది మరణించారు. 2023లో ఇదే సమయంలో 1,421 కేసులు నమోదవగా 2024లో ఏకంగా 32,380 కేసులు వెలుగు చూశాయి. మరోవైపు కోరింత దగ్గుకు చైనా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.

Similar News

News November 15, 2024

సమగ్ర కుటుంబ సర్వేలో కవిత(PHOTOS)

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లు ఇవాళ హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ సిబ్బందికి తమ పూర్తి వివరాలు ఇచ్చారు. కొన్ని వివరాలను కవితనే స్వయంగా నమోదు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌పై బయటికొచ్చిన కవిత చాలారోజుల తర్వాత బయటి ప్రపంచానికి కనిపించారు.

News November 15, 2024

రైళ్లలో రీల్స్.. రైల్వే కీలక నిర్ణయం

image

రైళ్లు, రైల్వే స్టేషన్లు, కోచ్‌లలో రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దేశంలోని అన్ని రైల్వే జోన్లకు సూచించింది. కాగా కదులుతున్న రైళ్లలో, పట్టాల పక్కన ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతుండటంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

News November 15, 2024

అల్లు అర్జున్ ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేశారు: గుణశేఖర్

image

తాను కష్టాల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఆదుకున్నారని డైరెక్టర్ గుణశేఖర్ అన్‌స్టాపబుల్‌ షోలో వీడియో సందేశంలో తెలిపారు. ‘వరుడు సినిమాతో బన్నీకి నా వల్ల ఫ్లాప్ వచ్చింది. అయినా సరే రుద్రమదేవి సినిమా సమయంలో నాకు కాల్ చేశారు. ‘మీ సినిమా కష్టాల్లో ఉందని విన్నాను. నా వల్ల మీకు హెల్ప్ అవుతుందనుకుంటే ఏదైనా పాత్ర చేస్తాను’ అన్నారు. అడక్కుండానే ముందుకొచ్చి సాయం చేసిన మంచి మనిషి బన్నీ’ అని కొనియాడారు.