News November 7, 2025
‘విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి’

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పారం లక్ష్మీనారాయణ అన్నారు. వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక తరపున ఏర్పాటు చేసిన చెకుముకి టాలెంట్ టెస్ట్ ను అర్బన్ మండల విద్యాధికారి బానాల సదానందంతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు 37 సంవత్సరాలుగా సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 24, 2026
సింహాచలం: రూ.15.55 కోట్లకు తలనీలాల షీల్డ్ టెండర్

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ ఆధ్వర్యంలో తలనీలాల షీల్డ్ టెండర్‌కు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.15.55 కోట్లకు తమిళనాడుకు చెందిన దురై ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది. ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు ఈ టెండర్ అమలులో ఉండనుంది. గత వేలం పాటలతో పోలిస్తే ఈసారి దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించిందన్నారు.
News March 24, 2026
డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలి: రేవంత్

TG: దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని BJP అనుకుంటోందని CM రేవంత్ ఆరోపించారు. డీలిమిటేషన్‌పై TV9 సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘ఏ లెక్క ప్రకారం 50% సీట్ల పెంపు ఉంటుంది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికే నష్టం. సీట్ల పెంపుపై చర్చ జరగాలి. 50% పెంపులోనే కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి’ అని పిలుపునిచ్చారు.
News March 24, 2026
సిద్దిపేట: వేర్వేరు కారణాలతో ఇద్దరు యువకుల సూసైడ్

సిద్దిపేట జిల్లాలో వేర్వేరు కారణాలతో ఇద్దరు యువకులు సూసైడ్ చేసుకున్నారు. వర్గల్‌కు చెందిన కరుణాకర్ గౌడ్(36) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వర్గల్(M) నెమ్టూర్‌కు చెందిన <<19467591>>అశోక్<<>>(34) కుటుంబ తగాదాలతో నేపథ్యంలో మనస్తాపంతో ఉరేసుకున్నాడు.


