News November 7, 2025
అన్నవరం దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శుక్రవారం నిత్య కల్యాణ మండపంలో నిర్వహించారు. 30 రోజులకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా ఆలయానికి రూ.1 కోటి 73 లక్షల 37 వేల ఆదాయం లభించింది. భక్తులు 37 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సమర్పించారని ఈఓ సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రోహిత్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 10, 2026
VZM: గిరిజన మహిళలకు గుడ్ న్యూస్

జిల్లాలో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం SCA పథకం అమలు చేస్తోందని గిరిజన సాధికారిత అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ పథకం కింద 54 ఉపాధి యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ. 1.62 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఒక్కో లబ్ధిదారునికి రూ. 50 వేల సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ఆయన వివరించారు.
News March 10, 2026
TUలో అంతర్ కళాశాలల ఖో-ఖో జట్ల ఎంపికలు

TU పరిధిలోని డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలల ఖో-ఖో (పురుషుల, మహిళల) జట్ల ఎంపిక మంగళవారం ప్రారంభమైంది. వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జి. బాలకిషన్ మాట్లాడుతూ, ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు కర్ణాటకలోని దావణగెరె యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ (2025-26) పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి వర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
News March 10, 2026
32,000 మంది అనర్హులకు PMKY నిధులు

PM కిసాన్ పథకం TGలో పక్కదారి పట్టింది. ఐటీ చెల్లింపుదారులు, భూమిని అమ్మేసిన వారు, ఇతర అనర్హులు ఇలా 32 వేలమంది లబ్ధి పొందినట్లు తేలింది. ఈ-కేవైసీలో ఆధార్ కార్డు లింక్ చేయడంతో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టిన వారు, అధిక భూమి ఉన్నవారు, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ లబ్ధి కలిగినట్లు తేలింది. వీరికి PMKY నిలిపేశారు. పరిశీలన పూర్తయితే అనర్హులు ఇంకా తేలనున్నారు. ఈ స్కీములో ఏడాదికి ఎకరాకు ₹6వేలు ఇస్తున్నారు.


