News April 11, 2024
అయోధ్య రాముడికి ‘బంగారు రామాయణం’
అయోధ్య రాముడికి ఓ మాజీ IAS అధికారి ఏడు కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. ఇది రూ.4.5-5 కోట్ల విలువ చేస్తుందని సమాచారం. 500లకు పైగా బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని ప్రధాన మందిరంలో ఉంచారు. 147 కేజీల బరువు ఉండే ఈ రామాయణం తయారీలో 140 కేజీల రాగి, వెండిని ఉపయోగించారు. ఇందులో 10,192 శ్లోకాలను లిఖించారు. కాగా ప్రాణప్రతిష్ఠ సమయంలోనే తన సంపాదనను బాల రాముడికి ఇస్తానని ఆ అధికారి ప్రతిజ్ఞ చేశారు.
Similar News
News November 15, 2024
ఝార్ఖండ్ ఎన్నికల వేళ బీజేపీ వ్యూహం
ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్‌కు గిరిజనుల ఆరాధ్యుడు <<14618652>>బిర్సాముండా పేరు<<>> పెట్టి BJP వ్యూహాత్మక రాజకీయానికి తెరలేపింది. ఝార్ఖండ్‌లో 38 సీట్లకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఝార్ఖండ్ ఏర్పడకముందు 1875-1990 మధ్య కాలంలో ఈ ప్రాంత గిరిజనులకు బిర్సాముండా ఓ ధైర్యం. ఆ స్థాయి ప్రాబల్యం కలిగిన బిర్సా పేరును ఎన్నికల వేళ తెరపైకి తెచ్చి BJP వ్యూహాత్మక రాజకీయం చేస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.
News November 15, 2024
నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే..
కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. రోజుకోసారైనా రుచి చూడాలని తహతహలాడుతుంటారు. కానీ నెలరోజులపాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నెలపాటు మానేస్తే అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్య తగ్గి, ఎముకల బలం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్థరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.
News November 15, 2024
US డోజ్ నుంచి జాబ్ నోటిఫికేషన్
యూఎస్ డోజ్ (DOGE) జాబ్ అప్లికేషన్లను ఆహ్వానించింది. అమెరికా ఫెడరల్ పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దడం సహా అనవసర ఖర్చులను తగ్గించేలా నిత్యం వ్యూహాలను ప్రతిపాదించే సమర్థుల కోసం వెతుకుతోంది. సూపర్ IQ ఉన్న వ్యక్తులు వారంలో 80 గంటలకుపైగా పనిచేయగలిగిన వారు తమ CVలను పంపాలని కోరింది. వీరిలో టాప్ 1% అభ్యర్థులను మస్క్, వివేక్ రామస్వామి రివ్యూ చేసి ఎంపిక చేస్తారని డోజ్ తెలిపింది.