News November 7, 2025
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి: కలెక్టర్

నక్కపల్లి మండలం పెదబోదిగల్లంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేలా సహకరించాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో వీవీ రమణ, తహశీల్దార్ నర్సింహమూర్తి, డీఎల్ పురం, చందనాడ, మూలపర్రకు చెందిన కొందరితో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణణానికి కొంత సమయం కావాలని, భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు.
Similar News
News April 10, 2026
ముదిగుబ్బ: ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ముదిగుబ్బ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. అనంతపురం రోడ్డులో ముందు వెళ్తున్న నీటి ట్యాంకర్‌ను ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హెడ్ కానిస్టేబుల్ గణేశ్ ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News April 10, 2026
వేరుశనగ ధరలు పతనం

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వారం రోజులుగా క్వింటా రూ.7 వేలకు పైగా పలికిన ధర, గురువారం గరిష్ఠంగా రూ.6,690లకు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌కు 113 క్వింటాళ్ల దిగుబడి రాగా, కనిష్ఠ ధర రూ.5,700, మధ్యస్తంగా రూ.6,121లకు అమ్ముడుపోయినట్లు యార్డ్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. ధరల తగ్గుదలపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 10, 2026
రూ.200 కోట్లతో మరో సైబర్ టవర్

ఐటీ హంగులకు ప్రతీకగా త్వరలో మరో అత్యాధునిక సైబర్ టవర్ నిర్మాణం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కోసం కైత్లాపూర్‌లోని 5ఎకరాల స్థలంలో G+8 అంతస్తుల సమీకృత భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.200కోట్ల అంచనాతో నిర్మించనున్నారు. 3జోన్లు, 16సర్కిళ్ల పరిధిలోని ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించడమే లక్ష్యంగా ఈ భారీ భవన నమూనాను సిద్ధం చేస్తున్నారు.


