News November 7, 2025
RBI సంస్కరణలతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం: సంజయ్

రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, విధానపరమైన నిర్ణయాలే దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశాయని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. RBI చేపట్టిన సంస్కరణల వల్లే 2018లో నష్టాల్లో ఉన్న SBI ఇప్పుడు 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరిందన్నారు. 27గా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను 12కి తగ్గించడం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి కారణమని SBI బ్యాంకింగ్, ఎకనమిక్స్ కాన్‌క్లేవ్-2025లో అన్నారు.
Similar News
News November 7, 2025
బ్రిటిష్ పాలన చట్టాలతో ఆస్తి కొనుగోళ్లలో కష్టాలు: SC

దేశంలో ప్రాపర్టీ కొనుగోళ్లు బాధలతో కూడుకున్నవిగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘1882 నాటి చట్టాలతోనే ఇప్పటి ‘రియల్’ వ్యవహారాలు నడుస్తున్నాయి. నాటి యాక్ట్ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తుంది తప్ప టైటిల్ కాదు. రిజిస్టర్డ్ సేల్‌డీడ్ లావాదేవీ విలువ రికార్డు మాత్రమే. అది యాజమాన్య హక్కు ఇవ్వదు’ అని పేర్కొంది. చట్టాలను సవరించి నేటి టెక్నాలజీతో రిజిస్ట్రేషన్లను ఆధునికీకరించాలని సూచించింది.
News November 7, 2025
HDFC బ్యాంక్ యూజర్లకు BIG ALERT

ఈ రాత్రి 2.30 గంటల(8వ తేదీ) నుంచి ఉ.6.30 గంటల వరకు తమ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని HDFC ప్రకటించింది. మెయింటెనెన్స్‌లో భాగంగా UPI, నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఈమేరకు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపుతోంది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్స్ కోసం PayZapp వ్యాలెట్ వాడాలని సూచించింది. మరి మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?
News November 7, 2025
సిరీస్‌పై భారత్ కన్ను!

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 2-1తో లీడ్‌లో ఉన్న భారత్ రేపు జరిగే చివరి(5వ) మ్యాచులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోగా ఇదైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అయితే మ్యాచ్ జరిగే గబ్బా(బ్రిస్బేన్) గ్రౌండ్‌లో ఆసీస్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006 నుంచి ఇక్కడ ఆ జట్టు 8 టీ20లు ఆడగా కేవలం ఒక్కదాంట్లోనే ఓడింది. దీంతో ఆసీస్‌ను ఇండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.


