News November 7, 2025

వంగ, బెండలో కాపు దశలో చీడల నివారణ

image

కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.

Similar News

News March 18, 2026

ICC ర్యాంకింగ్స్.. కోహ్లీ, రోహిత్ స్థానాలివే..

image

ICC ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో NZ బ్యాటర్ మిచెల్ తొలి స్థానంలో నిలిచారు. భారత బ్యాటర్లు కోహ్లీ(2), రోహిత్(4), గిల్(5), రాహుల్ (9) టాప్-10లో ఉన్నారు. బౌలింగ్‌లో భారత్ నుంచి కుల్దీప్(8) ఒక్కరే టాప్-10లో నిలిచారు. ఆల్‌రౌండర్లలో అక్షర్ పదో స్థానంలో ఉన్నారు. అటు T20 బ్యాటింగ్‌లో అభిషేక్(1), ఇషాన్(2), తిలక్(6), సూర్య(9) టాప్-10లో ఉన్నారు. బౌలర్లలో వరుణ్ 2, బుమ్రా 5వ స్థానంలో నిలిచారు.

News March 18, 2026

కావ్యా.. కాల్ చెయ్: లలిత్ మోదీ

image

పాక్ బౌలర్ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన <<19366541>>వివాదం<<>>లోకి IPL ఫౌండర్ లలిత్ మోదీ ఎంటర్ అయ్యారు. ‘ఫ్యాన్స్ ఆవేశంలో ఉన్న సమయంలో ఒక పాక్ ప్లేయర్‌పై ₹2.34 కోట్లు ఇన్వెస్ట్ చేయడమా? ప్రజాభిప్రాయాన్ని ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చెయ్’ అంటూ పరోక్షంగా SRH ఓనర్‌ కావ్యా మారన్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.

News March 18, 2026

₹2.40 లక్షలిస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి: US

image

అక్రమ వలసదారులు తమ దేశం విడిచి వెళ్లాలని US మరోసారి కోరింది. చట్టవిరుద్ధంగా నివసిస్తున్నందుకు వేసిన ఫైన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు అందజేస్తామని పేర్కొంది. అలాగే ₹2,40,329 ఎగ్జిట్ బోనస్ కింద ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రకటనతో పాటు తాజ్‌మహల్ ఫొటోను పోస్ట్ చేసి ‘Fly to India For Free’ అంటూ రాయడం చర్చనీయాంశమైంది.