News November 7, 2025

కృష్ణ: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

image

కృష్ణ మండలం గుడెబల్లూరులో ఓ యువకుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ నవీద్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మేకలి మహేష్ (24) గురువారం రాత్రి భోజనం చేసి, గ్రామ శివారులోని తన పత్తి పొలంలో ఉన్న రూమ్‌లో శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుడి తల్లి మేకలి తాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 21, 2026

HYDలో ఈ-సిగరెట్ల దందా.. 261 ప్రాంతాల గుర్తింపు

image

HYDలో ఈ-సిగరెట్ల దందా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈగల్ టీమ్ నివేదిక ప్రకారం.. సుమారు 261 ప్రాంతాల్లో వీటి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కళాశాలల పరిసరాలు, పాన్ దుకాణాలు, సిగరెట్ షాపుల వద్ద ఇవి విస్తృతంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ-సిగరెట్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరిస్తూ, నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మేడ్చల్ జిల్లాలో ఎక్కడెక్కడ 2BHK ఇళ్లు..!

image

మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. రాంపల్లిలో సుమారు 3 వేలకు పైగా, దుండిగల్ ప్రాంతంలో కూడా 3 వేలకుపైగా ఇళ్లు నిర్మించారు. అహ్మద్‌గూడ, మన్సాన్‌పల్లి, శంకర్‌పల్లి, నల్లగండ్ల, నర్సింగ్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో కూడా ఈ ఇళ్లు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముప్పైకి పైగా మురికివాడల్లో గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించారు.