News November 7, 2025
తొండూరు: పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లి గడ్డలు

తుఫాన్ వల్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోతుందని జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండూరు మండలంలో వందల ఎకరాల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇనగలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గంగయ్య ఉల్లి పంట పీకి గట్లపై గడ్డలు ఆరబెట్టగా, మరి కొంతమంది ఉల్లి గడ్డలు అమ్మేందుకు కలాల్లో ఆరబోశారు. కీలక దశలో రైతు పాలిట వర్షాలు ఆశనిపాతంలా మారాయ్నారు. నష్టపోయిన ఉల్లి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Similar News
News March 11, 2026
కడప జిల్లా: ఒక్కరోజులో 274 కేసులు.!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప ఎస్పీ షెల్కే నచికేత్ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు మీరిన వారిపై 274 కేసులు నమోదు చేసి రూ.56,615 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
News March 11, 2026
కడప: రైతు కష్టం.. AMCలకు ఆదాయం పంట..!

రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై కడప జిల్లా AMCలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవని నాటికి రూ.11.78 కోట్లు లభించింది. పంటల వారీగా AMCలకు లభించిన ఆదాయం రూ.లక్షల్లో ఇలా. వరి-194, బియ్యం-52, వేరుశనగ-43, ప్రొద్దుతిరుగుడు-3, పత్తి-117, ఉల్లి-17, పప్పుశనగ-86, కందులు-3, బత్తాయి-14,, పసుపు-99, మినుములు-98, నువ్వులు-,96, మొక్కజొన్న-62, జొన్న-16, పప్పుదినుసులు-12, అరటి-21, ఇతర పంటలు-239 లక్షలు.
News March 11, 2026
నిబంధనలు పాటించని వారిపై 274 కేసులు నమోదు: కడప ఎస్పీ