News November 7, 2025

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పీలేరు మండలం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఆసుపత్రికి సంబంధించి ఓపీ రిజిస్టర్, డిస్పెన్సరీ రిజిస్టర్లను పరిశీలించారు. చిన్నపిల్లలకు టీకాలు ఎప్పుడు ఎప్పుడు వేస్తున్నారు వంటి సమాచారాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 18, 2026

మనస్తాపంతో గడ్డిమందు తాగి యువతి ఆత్మహత్య

image

ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానన్న బెంగతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లరుపల్లికి చెందిన భవాని పీజీ పూర్తి చేసి, గత కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్లు రాకపోవడం, ఉద్యోగం వస్తుందో లేదోనన్న ఆందోళనతో బుధవారం మనస్తాపం చెంది గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.

News March 18, 2026

1,295 ఉద్యోగాల భర్తీకి తిరువూరులో 23న జాబ్ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో తిరువూరు వాహిని కళాశాలలో ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ద్వారా రూ.12,000-30,000 వేతనంతో పలు సంస్థల్లో 1,295 ఉద్యోగాలను భర్తీ చేస్తామని APSSDC అధికారులు తెలిపారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, బీటెక్, పీజీ చదివిన 18- 45 ఏళ్లలోపు వయస్సున్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చన్నారు.

News March 18, 2026

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం: ఎస్పీ

image

జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్ల పరిధిలో నేరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.