News November 7, 2025

పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

image

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 16, 2026

డిచ్‌పల్లి: టీయూలో రేపు మెగా జాబ్ మేళా

image

టీయూలో ట్రైనింగ్&ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో రేపు డిచ్‌పల్లి క్యాంపస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా.పాత నాగరాజు మాట్లాడుతూ.. 50కుపైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. IT, ఫార్మా, నర్సింగ్, బ్యాంకింగ్ తదితర రంగాల్లో 5,000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నారు.

News March 16, 2026

NZB: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: MP

image

నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు సంబంధించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని MPఅర్వింద్ ధర్మపురి కోరారు. జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాశారు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట పండిందని అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (MSP) రూ.2,400 ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేవన్నారు.

News March 16, 2026

స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో సందర్శించాలి: NZB కలెక్టర్

image

మండల ప్రత్యేక అధికారులు అందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయి సందర్శనలు జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వచ్చే రెండు మూడు వారాలు ఎంతో కీలకమైనవన్నారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల పరిధిలోని గ్రామ సభలను సందర్శించాలని ఆదేశించారు.