News November 7, 2025
అనకాపల్లి: రేపు పాఠశాలలకు సెలవు లేదు

అనకాపల్లి జిల్లాలో ఈనెల 8వ తేదీన పాఠశాలలకు సెలవు లేదని డీఈఓ అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. మొంథా తుఫాన్ కారణంగా ఇచ్చిన సెలవులకు ప్రత్యామ్నాయంగా నవంబర్ 8వ తేదీ రెండో శనివారం పాఠశాలు పనిచేస్తాయన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు గమనించాలన్నారు.
Similar News
News March 11, 2026
APPLY: డిగ్రీతో నెలకు రూ.50వేల జీతం

IDBIలో 1,300 పోస్టులకు ఈ నెల 19న దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. జూ.అసిస్టెంట్ మేనేజర్ ‘గ్రేడ్-ఓ’ ఉద్యోగాలకు డిగ్రీలో కనీసం 60% ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ‘గ్రేడ్-ఏ’ పోస్టులకు డిగ్రీతో పాటు బ్యాంకింగ్ సెక్టార్‌లో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. 1 మార్చి 2026 నాటికి వయసు 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
వెబ్‌సైట్: <
News March 11, 2026
సంగారెడ్డి: 12న ‘ప్రజా పాలన’పై అవగాహన సదస్సు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ఈ నెల 12న ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఈ సదస్సుకు హాజరుకావాలని సూచించారు. జూన్ 12 వరకు అమలుకానున్న ఈ ప్రణాళిక ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతంపై దిశానిర్దేశం చేయనున్నారు.
News March 11, 2026
VKB: నూతన సర్పంచులకు రేపు అవగాహన సదస్సు: కలెక్టర్

నూతనంగా గెలుపొందిన సర్పంచులకు రేపు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలి కార్ ఫంక్షన్ హాల్లో గురువారం నూతనంగా ఎంపికైన సర్పంచ్లకు ప్రజాపాలనలో భాగంగా 99 రోజుల ప్రణాళికపై అవగాహన కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. సర్పంచులంతా పాల్గొని ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు.


