News November 7, 2025

వనపర్తి నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

image

అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు వనపర్తి నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 15న సాయంత్రం బయలుదేరి, 16న కాణిపాకం, వేలూరు దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుంది. పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 ఛార్జీ ఉంటుందని, యాత్ర 18న ముగుస్తుందని ఆయన వివరించారు.

Similar News

News March 26, 2026

ఇరాన్ దెబ్బ.. హోటళ్లకు మారిన అమెరికన్ దళాలు

image

గల్ఫ్ రీజియన్‌లోని తమ స్థావరాలపై ఇరాన్ దాడులతో US దళాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సైనికులంతా వాటిని ఖాళీ చేసి హోటళ్లు, ఆఫీసులకు మారినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. దీన్నిబట్టి ట్రంప్ సన్నాహాలు లేకుండానే యుద్ధంలోకి దిగినట్లు అర్థమవుతోందని ఓ అధికారి పేర్కొన్నట్లు తెలిపింది. మరోవైపు US జవాన్ల ఆచూకీ తెలపాలంటూ ప్రజలను IRGC కోరుతోంది. వాళ్లు పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆరోపిస్తోంది.

News March 26, 2026

చిరు, నాగబాబును అన్నయ్య అనే పిలుస్తా: అన్నా కొణిదెల

image

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనకు అన్నదమ్ములు లేరని, కానీ పెళ్లై కొణిదెల ఫ్యామిలీలోకి వచ్చాక చిరంజీవిని ‘అన్నయ్య’ అని, నాగబాబును ‘చిన్న అన్నయ్య’ అని పిలవడం భర్త నుంచి అలవాటైందని పేర్కొన్నారు. వరుసల పరంగా పిలుపులు వేరైనా.. మనసుతో వారిని తన సొంత సోదరులుగానే భావిస్తున్నానని ఆమె రాసుకొచ్చారు. మెగా బ్రదర్స్‌పై ఆమె చూపిన ఈ అనురాగం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

News March 26, 2026

అమరావతి రాజధాని రెండో దశకు మాస్టర్ ప్లాన్ సిద్ధం

image

రాజధాని 2వ దశ అభివృద్ధికి CRDA కసరత్తు ముమ్మరం చేసింది. 1,75,347 ఎకరాల విస్తీర్ణంలో మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన బాధ్యతలను సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్‌ సంస్థకు అప్పగించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, వాణిజ్య ప్రాంతాలు, రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ఈ ప్రణాళిక సాగనుంది. తొలి దశ ప్లాన్‌ను రూపొందించిన ఈ సంస్థే మళ్లీ ఎంపిక కావడంతో అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.