News November 7, 2025
వరంగల్‌లో MRPS ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం

వరంగల్‌లో ఈరోజు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల కార్యవర్గ ఉమ్మడి జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 11వ తేదీన నిర్వహించబోయే చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేతలు కోరారు.
Similar News
News March 13, 2026
HYD: ఫ్యాన్సీ నంబర్లతో భారీగా ఆదాయం

ఖైరతాబాద్ RTA కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకొనేందుకే వాహనదారులు పోటీ పడ్డారు. TG 09 L 0009ను రూ.10,50,000కు, TG 09 L 0007కు రూ.3,19,999, TG 09 L 0005ను రూ.2,00,005కు, TG 09 K 9999ను రూ.1.5 లక్షలకు, TG 09 L 0024ను రూ.1.24 లక్షలకు, TG 09 L 0001ను రూ.లక్షకు దక్కించుకున్నారు. ఈ నంబర్లతో RTA ఆఫీస్‌కు రూ.31,14,730 ఆదాయం వచ్చింది.
News March 13, 2026
ఖమ్మం: మెరుపు దాడులు.. 20 సిలిండర్లు సీజ్..!

ఖమ్మం నగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లపై సివిల్ సప్లై అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు. కొందరు దుకాణాల యజమానులు గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి 20 సిలిండర్లను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 6 కేసులు నమోదు చేసినట్లు DSO చందన్ కుమార్ తెలిపారు.
సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
News March 13, 2026
డాల్బీ ఫార్మాట్‌లో ‘పెద్ది’

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అడ్వాన్స్‌డ్ డాల్బీ ఫార్మాట్‌లో విడుదల(ఏప్రిల్ 30) కానున్న తొలి టాలీవుడ్ మూవీగా నిలవనుంది. దీంతో హైపర్ రియలిస్టిక్ వీడియో, అద్భుతమైన సౌండ్‌తో చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు వార్-2, కాంతార-2, GOAT చిత్రాలు రిలీజయ్యాయి.


