News November 7, 2025
విషం తాగి యువకుడు ఆత్మహత్య

మదనపల్లెలో విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. 2టౌన్ సీఐ రాజారెడ్డి వివరాల మేరకు.. రామారావుకాలనీకి చెందిన నాగరాజ కొడుకు శివ(24)ను కుటుంబీకులు మందలించారు. మనస్థాపానికి గురైన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయించి, తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News March 22, 2026
ఈ నెల 25న కాంగ్రెస్‌కు గుడ్‌బై: జీవన్ రెడ్డి

TG: ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని తెలిపారు. కాగా నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ గంటన్నర సేపు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. కాగా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.
News March 22, 2026
HYD: కుప్పకూలిన బాల్కానీ స్లాబ్.. తండ్రీకొడుకుల మృతి

పంజాగుట్ట PS పరిధిలోని కుందన్‌బాగ్ శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని బాల్కనీ పొడిగింపు కోసం ఐరన్ రాడ్‌లతో నిర్మించిన భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఎలక్ట్రిషియన్ పనికోసం వచ్చిన తండ్రీకొడుకులు వివేక్, దేవిదాస్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.